Sunday, November 17, 2024

అమెరికా పర్యటనలో చైనాను ప్రశంసించిన రాహూల్ గాంధీ

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహూల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈనెల 8న డల్లాస్‌ చేరుకున్న రాహూల్.. టెక్సాస్‌ యూనివర్సిటీలో విధ్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా రాహూల్ గాంధీ చైనాపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించడం చర్వత్రా చర్చనీయాంశమవుతోంది. భారత్‌, అమెరికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నప్పటికీ.. చైనాలో మాత్రం ఆ ఇబ్బంది లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో చైనా ఆధిపత్యం చలాయిస్తోందని చెప్పుకొచ్చారు.

మొత్తం మూడు రోజుల పర్యటన కోసం రాహూల్ గాంధీ అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలోనే టెక్సాస్ యూనివర్సిటీతో పాటు పలువురు ఎన్ఆర్ఐలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు రాహూల్. సెప్టెంబర్ 9 మరియు 10వ తేదీలలో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. అక్కడ థింక్ ట్యాంక్‌లు, నేషనల్ ప్రెస్ క్లబ్ మరియు ఇతరులతో సహా వివిధ రంగాల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ మేరకు రాహూల్ గాంధీ పర్యటనకు సంబందించి ఓవర్సీస్ కాంగ్రెస్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వాషింగ్టన్ లో ప్రత్యేకంగా ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు రాహూల్ గాంధి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular