రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయింది. పార్లమెంట్ లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని, దీంతో వరంగల్ టూర్ రద్దు అయిందని ఏఐసీసీ నుంచి సమాచారం పంపించారు. నిజానికి, వరంగల్‌కు రాహుల్ పర్యటన సోమవారం అర్థరాత్రి ఖరారైంది. దీంతో సీఎం రేవంత్ సహా మంత్రులు, నేతలు వరంగల్‌లో ఏర్పాట్లు చేశారు. ఆయన కోసం ఓ హోటల్‌లో ప్రత్యేకంగా గదిని బుక్ చేశారు. పార్టీ నేతలతో సమావేశం కోసం మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. కానీ, అత్యవసరంగా ఆయన పర్యటన రద్దు అయింది.