దేశంలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాహూల్ గాంధీ. అవును కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహూల్ గాంధీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఎప్పటికప్పుడు ఆయన పెళ్లి గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఎదో ఓ సమాధానం చెప్పి దాటవేస్తుండారు రాహూల్ గాంధీ. తాజాగా జమ్మూకశ్మీర్ లో తన పెళ్లిపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని, ఐతే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. సుమారు 20 నుంచి 30 సంవత్సరాలుగా పెళ్లి ఒత్తిడి నుంచి బయటకు వచ్చానని రాహుల్ కామెంట్ చేశారు.
గత వారం రాహూల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కశ్మీరీ యువతులతో రాహుల్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మాయిలు పెళ్లి గురించి రాహుల్ ని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా..నేను పెళ్లికి ప్లాన్ చేయడం లేదు.. కానీ అది జరిగితే మంచిది. 20, 30 సంవత్సరాల వివాహ ఒత్తిడి అధిగమించని పేర్కొన్నారు రాహూల్. అంతే కాదు తన పెళ్లికి తప్పకుండా ఆహ్వానిస్తానని కశ్మీర్ యువతులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాశ్మీరీ అమ్మాయిల బృందంతో తన సంభాషణకు సంబందించిన వీడియోను సోమవారం తన యూట్యూబ్ ఛానెల్ తో పాటు ట్విట్టర్-ఎక్స్ లో అప్లోడ్ చేశారు రాహూల్ గాంధి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.