Thursday, December 26, 2024

400ల మందితో నేడు రాహుల్ భేటీ

  • కులగణనపై అభిప్రాయ సేకరణకు రాష్ట్రానికి రాక
  • బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో
  • మేధావులు, విద్యావేత్తలు, పార్టీ నేతలతో సమావేశం

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మేధావులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. దాదాపు 400 మంది వివిధ వర్గాల వారితో ఆయన ముఖాముఖీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత నేడు (మంగళవారం) రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4.45 గంటలకు వారు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సమావేశంలో వారు పాల్గొంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలను వారు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందించామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ట్రాన్స్‌జెండర్లు, మహిళలతోనూ రాహుల్ ముచ్చట
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారు. కులగణన వాస్తవ పరిస్థితులపై మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంఘాల నేతలతో రాహుల్ భేటీ అవుతున్నారు. ట్రాన్స్‌జెండర్లు, మహిళలతోనూ రాహుల్ ముచ్చటిస్తారు. కులగణన ఎలా చేయాలన్న అంశాలపై రాహుల్ వారితో చర్చిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుటారు.

అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు బోయిన్ పల్లి బయల్దేరుతారు. 5.20 గంటలకు అక్కడికి చేరుకొని 5.30 గంటల నుంచి 6.30 వరకు ష్ట్రంలో అమలు చేయనున్న కులగణనపై వివిధ వర్గాల, వివిధ రంగాల వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 7.10 లకు బేగంపేటకు చేరుకొని ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్ గాంధీ పర్యటనపై చర్చించారు. కులగణన సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారు..? ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి..? ఏ కులాలకు ప్రభుత్వ సాయం ఎక్కువగా అవసరం..? అనే విషయాలను తెలుసుకొని డేటా రూపొందించి దాని ఆధారంగా ప్రభుత్వ ఫలాలను అందించనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com