Wednesday, November 6, 2024

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఏడాదికి ఇక మిగిలింది 35 రోజులే
రాహుల్‌ ‌సమాధానం చెప్పాలి
బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌అలవి కాని హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 330 రోజులు ముగిశాయని, ఏడాది నిండడానికి ఇంకా 35 రోజులే మిగిలిందన్నారు. కాంగ్రెస్‌ ‌హామీలపై దిల్లీ బాబు రాహుల్‌ ‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఏడాది కాలమంతా అటెన్షన్‌ ‌డైవర్షన్‌తో మూసీ సర్కార్‌ ‌పబ్బం గడిపిందని విమర్శించారు.

ఈ ప్రజా పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు తప్ప చెప్పుకోవడానికి ఏమున్నదని ప్రశ్నించారు. వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ‘ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. 2 లక్షల జాబ్‌ ‌లు ఎక్కడ అని నిరుద్యోగులు అంటున్నారు.  ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.4,000 పెన్షన్‌ ‌కోసం అవ్వ తాతలు, నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అడబిడ్డలు అడుగుతున్నారు. ఈ ప్రజా పాలనలో ధర్నాలు,రాస్తారోకోలు తప్ప? జవాబు చెప్తావా దిల్లీ బాబు రాహుల్‌ ‌గాంధీ?’ అంటూ కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular