Thursday, April 17, 2025

మోదీపై రాహుల్ దే పై చేయి….

  1. మొన్న అయోధ్యలో ఈ రోజ కశ్మీర్ లోనూ అదే….

మొన్న దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య ప్రజలు బీజేపీకి షాక్ ఇస్తే…ఈ సారి జమ్మూకశ్మీర్ ప్రజల వంతు అయ్యింది. ఈ రెండు విషయాల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్ గాంధీ పైచేయి సాధించారని చెప్పవచ్చు.

వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్ ఎలక్షన్స్‌ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టినా, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితమే ఎదురైంది…

సార్వత్రిక ఎన్నికల్లో రామ మందిరం షాక్… 

రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల స్వప్పం నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు…కోర్టు కేసులు… వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా అంతా మంచే అనుకున్నారు. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు వెల్లింది బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఇండీయా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తిరస్కరించారని అర్థం. ఇది ఊహించని షాక్ బీజేపికి అని చెప్పవచ్చు.

నేడు జమ్మూలో అదే పరిస్థితి…. 

తాజాగా బీజేపీ రెండో సారి షాక్ తగిలింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహం పన్నింది. అస్సలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ వ్యూహాలతో కశ్మీర్ లోని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఫలితంగా కశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి…. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము కశ్మీర్ , లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలు పెట్టాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. సాదరణగా పాకిస్థాన్ కబంధ హస్తాల్లోనూ వేర్పాటు వాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తీసుకొచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తి తో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పీడీపీతో పనిలేకుండా సింగిల్‌గా బరిలోకి దిగింది. కానీ ఈరోజు వచ్చిన ఫలితాల్లో బీజేపీకి షాక్ ఇచ్చింది. అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో జత కట్టిన కాంగ్రెస్ కశ్మీర్ లో హవా సాగించింది.

 

రాహుల్ గాంధీ పై చేయి….

 

ఈక్వేషన్ సింపుల్. ఫైట్ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేదే చూస్తారు. మన దేశంలో జాతీయ స్థాయిలో రెండే ప్రధాన అధికార కేంద్రాలు. ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ గద్దె దింపాలని ఈ కాంగ్రెస్ దేశంలోనే చాలా విపక్షాలు ఏకం చేసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. శ్రీనగర్ లో మంచులో తడుస్తూ యాత్రకు ముగింపు పలికారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించనంత పోటీ ఇచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. సొంతంగా 99 ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించటమే కాదూ… పార్లమెంటులో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్దశక్తిగా నిలిచింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకు కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం. వాటి సాధన కోసమే భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఇద్దరు ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండైన అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 లాంటి వి రద్దు చేసినా… ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్ గాంధీ విజయంగా తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్లని పెట్టి ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోడీ , అమిత్ షా లాంటి వాళ్లకే షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా. లేదా రెండు ఏదో కాకతాళీయంగా ఓడిపోయింది బ్యాడ్ లక్ అనుకోవాలా.

 

ఎ లాంటి ట్రిక్స్ వాడొద్దు :

జమ్మూకశ్మీర్‌ ఎన్నికల కౌంటింగ్ వేళ. బీజేపీ పై ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలు పన్నొద్దని ఆయన అన్ని పార్టీలను కోరారు. మేం విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. జమ్మూకశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. ప్రజల తీర్పు భాజపాకు వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఆ పార్టీ ఎలాంటి కుట్రల్లో భాగం కావొద్దని వ్యాఖ్యలు చేశారు. రెండు అసెంబ్లీ స్థానాలు గండేర్బల్‌, బుడ్గామ్‌ నుంచి పోటీపడిన ఒమర్‌ ప్రస్తుతానికి రెండుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదిలాఉంటే ఆయన ఎక్స్ ఖాతాలో కొన్ని సెల్ఫీలు పోస్టు చేశారు. కౌంటింగ్‌ రోజున 7K రన్ చేశా… క్రితంసారి సరిగ్గా పూర్తిచేయలేకపోయా. ఈసారి బాగుంటుందనుకుంటున్నా అన్న అర్థంలో పోస్టు పెట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com