* ఎక్కడైనా నుంచైనా పోటీ చేయాలని కోరుతున్నాం
* పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి రెండు, మూడు సీట్లు వస్తాయి…
* విలేకరులతో మంత్రుల చిట్‌చాట్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెటిఆర్‌కు సవాల్ విసిరారు. నల్గొండలో రిజైన్ చేస్తా , కెటిఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలని, నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా, ఇక కారు షెడ్డు మూసుకోవాలని, కెటిఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కెసిఆర్ ప్రకటన చేస్తారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. తాను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్‌కు టెక్నీకల్ నాలెడ్జి లేదని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి విమర్శించారు. కెటిఆర్ ఒక చిన్న పిలగాడని, – నా స్థాయి కెటిఆర్‌ది కాదనీ, కెటిఆర్‌కు క్యారెక్టర్ లేదని, ఆయన దగ్గర లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని, తనకు మాత్రం క్యారెక్టర్ మాత్రమే ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కెటిఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30వేల మెజార్టీతోనే గెలుస్తాడా, తానైతే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
బిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు
లోక్‌సభ పోటీలో మా ప్రత్యర్థి బిజెపి పార్టీయేనని బిఆర్‌ఎస్ కాదనీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ముగ్గురు మంత్రులు విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలనీ ప్రఫోజల్ పెట్టామన్నారు. రాహుల్‌గాంధీ నల్గొండ లేదా భువనగిరి నుంచి ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని తాము కోరుతున్నామన్నారు. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఎంపి అరవింద్ ను ప్రజలు మర్చిపోయారన్నారు. 2వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం అయ్యిందని, రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్న వాళ్లలో మేము కూడా ఉన్నామని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నారు. నా పేరుమీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే నిజామాబాద్ ఎంపి అరవింద్ కు రాసి ఇస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎలాగూ తమకు పోటీ కాదనీ, బిజెపికి రెండు, మూడు సీట్లు వస్తాయేమో తమకు తెలియదని మంత్రులు అన్నారు.
మా అమ్మను బండి సంజయ్ అవమానించారు: మంత్రి పొన్నం
అరవింద్, బండి సంజయ్ పెద్ద లీడర్లు అనుకున్నారని ఎమ్మెల్యేలుగా ఓడిపోయారని వారు ఎద్దేవా చేశారు. అరవింద్, బండి సంజయ్ పొలిటికల్ లీడర్లు కాదనీ, గాలిలో గెలిచారు, బ్రేకింగ్ కోసం మాత్రమే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతారన్నారు. హైదరాబాద్ విజయవాడ, పసుపు బోర్డుపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరని వారు ప్రశ్నించారు. రాష్ట్రం గురించి పార్లమెంట్ లో నలుగురు బిజెపి ఎంపిలు ఎప్పుడూ మాట్లాడంగా తాను చూడలేదని, మా అమ్మను బండి సంజయ్ అవమానించారని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.