Sunday, December 29, 2024

మీ విజన్ నుంచే మా పని తీరు ప్రేరణ పొందింది

మీ విజన్, మీ వాగ్ధానాలకు అనుగుణంగా రాష్ట్ర గిగ్ వర్కర్స్ పాలసీని
సమగ్రంగా, న్యాయబద్ధంగా, మార్గదర్శకంగా మారుస్తాం
రాహుల్ గాంధీ లేఖపై ట్వీట్ వేదికగా
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గిగ్ వర్కర్ల విషయంలో ఏఐసిసి అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘డియర్ రాహుల్ జీ, మా పని తీరు అంతా మీ విజన్ నుంచి ప్రేరణ పొందింది. తెలంగాణలో కులగణన సర్వే మిమ్మల్ని గర్వపడేలా చేయడం మాకు మరింత శక్తిని ఇస్తుంది. మీ విజన్, మీ వాగ్ధానాలకు అనుగుణంగా రాష్ట్ర గిగ్ వర్కర్స్ పాలసీ విషయంలో అందరిని కలుపుకొని మరింత సమగ్రంగా, న్యాయబద్ధంగా, మార్గదర్శకంగా మారుస్తామని రేవంత్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల రాసిన లేఖను బుధవారం ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి జత చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ రాసిన లేఖ ఇలా….
సిఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన గిగ్ వర్కర్ల ముసాయిదా చట్టానికి సూచనగా తాను ఈ లేఖను రాస్తున్నానని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల విషయంలో ముసాయిదా చట్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు జరపాలని తాను అభ్యర్థిస్తున్నానని, అన్ని పక్షాల అభిప్రాయాలు వినడం ద్వారా చట్టం పటిష్టంగా, ప్రభావవంతంగా, అర్థవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ రంగం కోసం భవిష్యత్ నిబంధనలను రూపొందించడంలో కూడా ఈ ప్రక్రియ సహాయ పడుతుందన్నారు. ఈ సంప్రదింపు ప్రక్రియలో భాగమైనందుకు తాను సంతోషిస్తానని భవిష్యత్ కోసం సుస్థిరమైన గిగ్ ఎకానమీని నిర్మించడంలో తెలంగాణ ముందుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు. గత దశాబ్దంలో, లక్షలాది మంది కార్మికులు గిగ్ ఎకానమీలో చేరారని ఆయన గుర్తు చేశారు. తక్కువ నైపుణ్యంతో ప్రవేశం దొరికి ఆదాయం సమకూర్చుకునే రంగంగా ఇది మారిందని ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేనప్పుడు అనేక మందికి జీవనోపాధి చూపిస్తున్న రంగంగా ఇది నిలిచిందని రాహుల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉంది
అయితే ఈ రంగంలో నిబంధనలు లేకపోవడంతో కార్మికుల దోపిడీ, రోజువారి పనిలో సామాజిక వివక్ష, అమానవీయ ప్రవర్తనతో పోరాడుతూనే ఉన్నారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం లేకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ రంగంలోని కార్మికులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని గిగ్ కార్మికులను రక్షించడానికి వారికి సామాజిక భద్రతను పెంచడానికి ఒక చట్టాన్ని రూపొందించేలా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉందన్నారు. ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ దిశలో అనేక చర్యలు తీసుకుంటున్నాయని రాహుల్ చెప్పారు.

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల సంక్షేమానికి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించిందని రాహుల్ తెలిపారు. మీరు కూడా తెలంగాణ ప్రజలకు మా హామీని గౌరవిస్తూ, ఒక ముసాయిదా చట్టంతో ముందుకు సాగుతున్నందుకు, ఒక సూచనను అందించడానికి తాను సంతోషిస్తున్నానన్నారు. తాను ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే కోసం శక్తివంతమైన ప్రజా సంప్రదింపు ప్రక్రియ తనను ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com