ఢిల్లీలోని బిజ్వసన్ ప్రాంతంలో ఓ సైబర్ క్రైమ్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో రైడ్ చేయడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసును నమోదు చేశారు. సైబర్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, అతడు సోదురుడు ఈడీ బృందంపై దాడి పాల్పడ్డారని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, సోదాలు కోనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా గురువారం ఈడీలోని హై ఇంటెన్సిటీ యూనిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో దిల్లీలో బిజ్వాసన్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా, ఐదుగురు దుండగులు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్‌కు గాయలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్, పిషింగ్, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్ క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికితీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ సైబర్ మోసాల ద్వారా సంపాదించిన డబ్బను దాదాపు 15వేల మ్యూల్ అకౌంట్స్ (మనీలాండరింగ్, తప్పుడు లావాదేవీలు వంటి చట్టవిరుద్ధమైన కార్యకాలపాలకు ఉపయోగించే ఖాతాలు) మళ్లించారని అధికారులు తెలిపారు. ఆ ఖాతాల డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి యూఏఈ చెందిన పీవైవైపీఎల్ పేమెంట్ అగ్రిగేటర్ వర్చవల్ అకౌంట్స్‌కు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఖాతాల్లోని నిధులను ఉపయోగించి క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.