అర్ధరాత్రి నుంచి కురుస్తున్న ఉరుములతో కూడిన భారీ వర్షం, నాలుగు రోజులుగా ముంపులోనే సింగ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ వాసులు. నిన్న సింగ్ నగర్ ముంపు ప్రాంతాన్ని వదిలి సిటీలోకి బయటకు వచ్చిన వేలమంది వరద బాధితులు. వరద ఉధృతి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం ఈరోజు పూర్తిగా వాటర్ లెవెల్ తగ్గితే క్లీనింగ్ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు.
అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పారిశుద్ధ పనులకు ఆటంకం కలిగే అవకాశం, వరద ముంపు నుంచి పూర్తిగా తేరుకోవడానికి ఇంకొక నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం, కట్టు బట్టలతో తెలిసిన వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోతున్న ముంపు ప్రజలు.