Saturday, September 21, 2024

చల్లని కబురు రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం

మరో ఐదు రోజులు వర్షాలే

టీఎస్ న్యూస్ : తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రీకృతమైందని తెలిపింది.

దీని వల్ల గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈదురు గాలుల కారణంగా మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని పేర్కొంది.

ఈ ఏడాది సమయానికై నైరుతి రుతు పవనాలు వస్తాయని స్కైమెట్‌ అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దక్షిణాది పాటు పశ్చిమ, నైరుతి లోనూ సమృద్ధిగా వర్షాలు పడతాయని తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular