Monday, May 12, 2025

రుణమాఫీ కోసం నిధుల సమీకరణ

  • ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు
  • ఇతర నిధుల వినియోగం
  • ఆగష్టు 15వ తేదీ కల్లా పూర్తిస్థాయిలో మాఫీ పూర్తి

పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ చేస్తోంది. ఇప్పటికే తొలివిడతగా లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగా దీనికోసం సుమారుగా ఇప్పటికే రూ.6 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రభుత్వం కేటాయించింది. అయితే రుణమాఫీ కోసం నిధుల సేకరణకు ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆగష్టు 15వ తేదీ కల్లా రుణమాఫీ చేసి తీరతామని సిఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం మొత్తంగా రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే లక్ష రుణమాఫీని ఇప్పటికే ప్రారంభించగా రూ.రెండు లక్షల రుణమాఫీని ఆగష్టు 15వ తేదీ లోపు పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర మార్గాల్లో వచ్చిన నిధులను రుణమాఫీ కోసం సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది.

జూలైలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు
జూలై నెలలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు సమీకరించింది. ఇతర మార్గాల్లో మరో రూ.5వేల కోట్ల వరకు నిధులను సేకరించింది. దీంతో మొదటి దఫా లక్ష రూపాయల్లోపు రుణమాఫీకి అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండడంతో వెంటనే మొదటివిడతలో లక్షలోపు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది. రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను, తర్వాత మిగిలిన అప్పులను మాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి సైతం మరో రూ.8 వేల కోట్ల వరకు అవసరమవు తాయని ప్రభుత్వం అంచనా వేసింది. మిగిలిన రుణాల మాఫీకి మరో రూ.15 వేల కోట్లు వరకు కావాల్సి ఉంటుందని సమాచారం. రెండో విడతతో పాటు మిగిలిన మొత్తానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఆగష్టు 15వ తేదీ లోపు మొత్తం రుణమాఫీ చేయాల్సిందేనంటూ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన రోజు నుంచే నిధులను సమీకరించే ప్రణాళికపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com