Friday, September 20, 2024

‘సారంగదరియా’ సక్సెస్ మీట్‌లో రాజా రవీంద్ర

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమా జూలై 12న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. మాకు మంచి థియేటర్లు దొరికాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ఈ టీంలో అందరూ మెచ్యూర్డ్ పర్సన్స్. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు హ్యాపియెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన థియేటర్లలో నా చిత్రానికి ఇంత మంచి ఆధరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మొదటి రోజు తక్కువ మంది చూశారు. మౌత్ టాక్ వల్ల మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మంచి కథతో సినిమా తీశాం. మంచి కాన్సెప్ట్ అనే నమ్మకం ఉంది. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని కారెక్టర్‌లకు మంచి ఆధరణ లభిస్తోంది. మా దర్శకుడు సినిమా మీద ప్యాషన్ మస్కట్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడకు వచ్చాడు. ఈ ఒక్క కథలోనే మూడు కథలు రాసుకున్నారు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్ కథను ఎలా రాశారో అర్థం కాదు. టెక్నికల్ టీంతో చక్కగా పని చేయించుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. డీఓపీ గారు ఇచ్చిన విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేశారు. ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. ‘సారంగదరియా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కెమెరా డిపార్ట్మెంట్‌లో ముందుగా పని చేశాను. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. సినిమాను బాగానే తీశాం. థియేటర్‌ కోసమే ఈ సినిమాను తీశాం. మా నిర్మాత గారు చాలా సపోర్ట్ చేయడంతోనే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. డీఓపీ గారు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయన వల్లే ఇంత గ్రాండియర్‌గా సినిమా వచ్చింది. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని గారు చక్కగా నటించారు. రాజా సర్ అద్భుతంగా నటించారు. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేష్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు పెరుగుతున్నాయి. హౌస్ ఫుల్‌ అవుతున్నాయి. ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిన్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర గారు అద్భుతంగా నటించారు. డెబ్యూ దర్శకుడిని నమ్మి ఆయన సాహసం చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ నడుస్తోంది. సోమవారం నుంచి మరిన్ని స్క్రీన్‌లు పెంచుతున్నాం. మౌత్ టాక్‌తో సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. చూడని వాళ్లంతా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

మోహిత్ మాట్లాడుతూ.. ‘సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు జనాల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే అంత బాగా నటించగలిగాను. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

ఈ కథ మొత్తం యదార్థ ఘటన  ఆధారంగా తయారు చేశారా? లేక ఫిక్షన్‌ యాడ్‌ చేశారా?

సినిమా మొత్తం రియల్‌ ఇన్‌సిండెంట్‌ ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సినిమాలో మరింత ఆసక్తి కోసం, కథలో

గ్రిప్పింగ్‌ కోసం కొంత ఫిక్షన్‌ డ్రామాను దర్శకుడు కలిపాడు. 48 గంటల్లో జరిగే కథ ఇది. తప్పకుండా ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠభరితంగా వుంటుంది.

ఇంతకు ముందు బుల్లితెరకు పరిమితమైన మీరు ఇప్పుడు వెండితెరపై బిజీ అవ్వడం పట్ల మీ ఫీలింగ్‌?

సినిమా నటించడం అనేది నా గోల్‌. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ అవ్వడం వల్ల, ఏ అవకాశం వస్తే ఆ అవకాశం చేస్తూ వచ్చాను. బిగ్‌బాస్‌ అయినా, సీరియల్‌ అయినా అప్పటి పరిస్థితులను బట్టి చేసి చేశాను. ఎలా చేసినా.. ఏమీ చేసినా నా ఫైనల్‌ గోల్‌ సినిమాల్లో నటించడమే.  బిగ్‌బాస్‌ తరువాత సినిమాలపై దృష్టి పెట్టాను. విరూపాక్ష తరువాత సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

విరూపాక్ష మీకు ఎలాంటి పేరు తెచ్చిపెట్టింది?

మంచి పాత్ర చేశాను అనుకున్నాను. ఇంత పేరు వస్తుందని అనుకోలేదు.  100 కోట్ల సినిమాలో నేను ఓ ముఖ్యపాత్రను చేయడం లక్కీగానే భావిస్తాను. విరూపాక్ష అవకాశం ఇచ్చిన దర్శకుడికి,  హీరో సాయిదుర్గా తేజ్‌, సుకుమార్‌ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. విరూపాక్ష సినిమాలో నటిస్తున్న సమయంలో వచ్చిన  ఆఫర్‌ ఇది. అడిషన్‌ ద్వారా దిబర్త్‌డే బాయ్‌ సినిమలో నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారు.

నటుడిగా మీ గోల్‌ ఏమిటి?

సినిమా ప్రాసెస్‌ అనేది అంతా ఈజీ కాదు. కొంత టైమ్‌ పడుతుంది. సినిమా అంటే పిచ్చి, కాబట్టే చావైనా, బ్రతుకైనా ఇక్కడే కాబట్టి అవకాశాల కోసం వెయిట్‌ చేస్తాను. విరూపాక్షతో నటుడిగా ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇలాగే నెమ్మదిగా మంచి పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు పొందాలి. నటుడిగా నేను చాలా నేర్చుకోవాలి.

ఇది కేవలం యూత్‌ను టార్గెట్‌ చేసిన సినిమా అనుకోవచ్చా?

ఇది పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. నలుగురు కుర్రాళ్లు నేచురల్‌గా బిహేవ్‌ చేస్తే ఎలా వుంటుందో ఈ సినిమా అలా వుంటుంది. అన్ని వర్గాల వారు తప్పకుండాఈ చిత్రం చూడొచ్చు.

హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నారని తెలిసింది.

అవును. అందులో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాను. ఈ  సినిమాలో కొత్త ప్రపంచంలా వుంటుంది. తప్పకుండా నా కెరీర్‌కు తేజ్‌ అన్న లక్కీ… విరూపాక్షతో తరువాత ఆయనతో మళ్లీ కలిసి నటించడం హ్యపీగా వుంది.

ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు?

ఏ1 ఏ2 ఏ3 అనే సినిమాలో  హీరోగా చేస్తున్నాను. విజయ్‌దేవరకొండ సినిమాతో పాటు సాయిధరమ్‌ తేజ సినిమాలో నటస్తున్నాను.  ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular