Monday, April 21, 2025

రాజమౌళి- మహేష్‌ అంతా సీక్రెటే?

రాజమౌళి సినిమా అంటే అంతా సర్‌ప్రైజ్‌.. సర్‌ప్రైజ్‌.. ఏవీ ఎక్కడా ఏ మీడియాకు సమాచారం తెలియకుండా అంతా జాగ్రత్త పడుతుంటాడు. అన్నింటిని గోప్యంగా ఉంచుతాడు. హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను నిర్మించి అందులో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారుట‌. అలాగే సిటీలో ప‌లు చోట్ల సినిమాకి సంబంధించిన ఖ‌రీదైన సెట్లు వేశారట‌. వాటిలో షూటింగ్ కి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈనెల‌ఖ‌రు నుంచి మ‌రో కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. అందులో మ‌హేష్ తో పాటు కీల‌క తారాగణ‌మంతా పాల్గొంటుందిట‌. అమెజాన్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ఇది. అలాంటి సెట్ల‌ను హైద‌రాబాద్ లోనే నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. అవ‌స‌రం మేర కొన్ని కీలక స‌న్నివేశాల కోసం అమెజాన్ అడ‌వుల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
`బాహుబ‌లి` షూటింగ్ స‌మ‌యంలోనూ భారీ వార్ స‌న్నివేశాల కోసం జార్జియా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మూవీ షూటింగ్ కూడా అలాగే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట. ఇందులో హీరోయిన్ గా గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. మేక‌ర్స్ ఆమెతో సంప్ర‌దింపులు జరుపుతున్నారు. ఇంకా చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాలేదు. వ‌చ్చిన త‌ర్వాత విష‌యాన్ని అధికారికంగా వెల్లడించే అవ‌కాశం ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com