Friday, January 10, 2025

సర్‌ప్రైజ్‌ చెయ్యడం జక్కన్నకి అలవాటే?

మహేష్ తో రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయి. ఇక దీనిపైన ప్రత్యేకమైన బజ్‌ క్రియేట్‌ చేయాల్సిన అవసరం లేదు. సినిమా పనులు మొదలు పెడుతున్నారని తెలిసి ఫ్యాన్స్ లో ఫుల్‌ జోష్ వచ్చింది. రీసెంట్‌గా మహేష్ జర్మనీ వెళ్లింది కూడా జక్కన్న సినిమా కోసమే అని టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే మహేష్ ఫారెస్ట్ లో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక మనోళ్ళ ఊహలు నిజమే మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే మహేష్ అక్కడ వాతావరణం అలవాటు చేసుకునేందుకే అక్కడకు వెళ్లాడని టాక్‌. అంతేకాదు నెవర్ బిఫోర్ యాక్షన్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ అందించేలా యాక్షన్ కొరియోగ్రఫర్స్ ని గైడ్ చేస్తున్నాడు. ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 తో రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

సినిమా కోసం మేజర్ పార్ట్ అంతా కూడా సాధ్యమైనంత వరకు ఒకటి రెండు షెడ్యూల్ లో జరిగేలా చూస్తున్నాడట. సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ని హైర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మాములు విషయమే అనుకోండి. జక్కన్న ఎక్కడా తగ్గడుగా మరి. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ దాకా తన టాలెంట్ చూపించిన రాజమౌళి మహేష్ తో హాలీవుడ్ సినిమాలకు ధీటైన సినిమా చేయాలని మైండ్ లో ఫిక్స్ అయ్యాడు. అందుకు తగినట్టుగా మహేష్ లాంటి హీరో దొరికాడు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఊహించేందుకు కూడా కష్టమే అనిపిస్తుంది. రాజమౌళి నుంచి వస్తున్న అసలు సిసలైన పాన్ వరల్డ్ సినిమాగా సూపర్ స్టార్ మహేష్ 29వ సినిమా త్వరలో షురూ కానుంది. మరి ఈ సినిమా మిగతా డీటైల్స్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. సినిమాను కె.ఎల్ నారాయణ 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com