Sunday, October 6, 2024

బుజ్జిలో ప్రభాస్‌ పెద్దమ్మ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ.. రిలీజైన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ సినిమా.. విజువల్స్, గ్రాఫిక్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ అలా అన్ని అంశాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. రిపీట్ మోడ్ లో సినిమా చూసేందుకు సిద్ధమైపోయారు. తమ ఫేవరెట్ హీరోకు అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు కొనియాడుతున్నారు.

అయితే సినిమాలో ప్రభాస్ యూజ్ చేసిన వెహికల్ బుజ్జి గురించి అందరికీ తెలిసిందే. మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్.. రయ్ రయ్ అంటూ రైడ్ చేసుకుని వచ్చి రివీల్ చేశారు. ఆ తర్వాత ఆ వాహానాన్ని పలువురు ప్రముఖులు డ్రైవ్ చేసి సందడి చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో తిప్పారు కల్కి మేకర్స్.

ఇప్పుడు సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ తీసుకొచ్చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసాద్ ఐమాక్స్ ముందు ఇప్పుడు బుజ్జి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామ‌ల దేవి బుజ్జి వెహిక‌ల్‌ లో కూర్చుని ఫ్యాన్స్ లో జోష్ నింపారు. కెమెరాలను క్లిక్ మనిపించారు. అభిమానులకు అభివాదం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. అయితే శ్యామల దేవి కల్కి రివ్యూ కూడా ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular