Wednesday, April 2, 2025

‘రాజాసాబ్‌’ షూట్‌లో ఆయనను చూసి ఆశ్చర్యపోయా-మాళవిక మోహన్‌

మాళవిక మోహనన్‌ ఈ కేరళకుట్టి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ ‘ది రాజాసాబ్‌’లో ప్రభాస్‌తో కలిసి నటిస్తుంది. ప్రభాస్‌ గురించి చేసిన కొన్ని ఆసక్తికర్‌ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి నుంచి తాను ప్రభాస్‌కు పెద్ద అభిమానినని, అప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేయాలని కలలు కన్నానని మాళవిక చెప్పారు. ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో ప్రభాస్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ చాలా నార్మల్‌గా, సపోర్టివ్‌గా ఉండటం, సెట్‌లో ఉన్న అందరితో సరదాగా గడపడం, టీమ్ మొత్తానికి మంచి ఫుడ్ పంపించడం, దగ్గర ఉండి బిర్యానీ తినిపించడం వంటివి చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ‘నిజంగా ప్రభాస్ చాలా స్వీట్’ అంటూ మాళవిక మోహనన్ ప్రభాస్‌ను ప్రశంసించారు. ప్రభాస్‌ ఎక్కడున్నా ఎవరికన్నా నచ్చుతాడు అందుకే కదా రాజు ఎక్కడున్నా రాజే అని అంటారు అని సోషల్‌ మీడియాలో వరుస కామెంట్లు పడుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com