ఒక్కో మీడియా సంస్థపై రూ. 10 కోట్ల దావా
రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా.. మొత్తంగా రూ. 160 కోట్లకు దావా వేశారు పాకాల. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో తన మీద అనవసర వార్తలు రాశారని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
అసత్య కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని పాకాల రాజేంద్రప్రసాద్ నోటీసుల్లో తెలిపారు. ఒక్కో మీడియా సంస్థపై రూ.10 కోట్ల దావా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. తప్పుడు కథనాలను వారంలోగా ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆయా మీడియా సంస్థలతోపాటు గూగుల్ ఇండియా, యూట్యూబ్ సంస్థలకు రాజేంద్రప్రసాద్ నోటీసులు పంపారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు నష్టం కలిగించారని, తాను అనుభవించిన మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. తనకు ఆయా సంస్థలు క్షమాపణ కూడా చెప్పాలని కోరారు.
16 మీడియా సంస్థలు ఇవే..
1. సమయం టివి
2. హిట్ టివి తెలుగు
3. తుపాకీ మీడియా ప్రయివేట్ లిమిటెడ్
4. హైదరాబాద్ మీడియా హౌజ్ ప్రయివేట్ లిమిటెడ్
5. హ్యాష్‌టాగ్ యు
6. ఏషియన్ ఎక్స్‌టి డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్
7. ఏషియానెట్ న్యూస్ తెలుగు
8. ఆంధ్రా విషెష్
9. స్లాష్ మీడియా అండ్ టెక్నాలజీస్
10. యోయో మీడియా ప్రయివేట్ లిమిటెడ్
11. ఒకేటీవీ మీడియా అండ్ బ్రాడ్‌క్యాస్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్
12. ప్రవాస మీడియా ఎల్‌ఎల్‌పి
13. వైల్డ్ వూల్ఫ్ న్యూస్
14. దాసరి శ్రీనివాస్(కాళోజీ టీవీ)
15. యూట్యూబ్ ఐఎన్‌సి
16. గూగుల్ ఎల్‌ఎల్‌సి