Friday, April 11, 2025

స్ట్రీమింగ్ కు రెఢీగా ఉన్న రాజు యాదవ్

ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరికెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’.తమిళం, మలయాళం సినిమాలలో కనిపించేటువంటి సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్ గా రూపొందించబడింది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రం. ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com