ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగులో పరిచయం అయినా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆ తరువాత కూడా తెలుగులో సినిమాలు బాగానే చేసారు. త్వరలోనే ఆమె లీడ్ రోల్ గా నటించిన రక్షణ అనే సినిమా రాబోతుంది అని మేకర్స్ స్పష్టం చేసారు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం పాయల్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా అయినా X ద్వారా ఒక విషయం వెల్లడించారు. తనని రక్షణ సినిమా ప్రొడ్యూసర్ ప్రొమోషన్స్ చేయదానికి అడగగా తనకి వేరే సినిమాల డేట్ ల వాళ్ళ కుదరదు అని చెప్పినట్లు, దీనికై సినిమా ప్రొడ్యూసర్ తనని తెలుగు సినిమాలకు దూరం చేస్తాను అని బెదిరించినట్లు ఆ X పోస్ట్ లో ఆమె తెలిపారు.
ఇది ఇలా ఉండగా రక్షణ సినిమా ప్రొడ్యూసర్ & డైరెక్టర్ అయిన శ్రీ ప్రాందీప్ ఠాకూర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసారు. కాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక ఆఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు.