Saturday, November 16, 2024

లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక రంజాన్

  • లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక రంజాన్
  • రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లిన సిఎం రేవంత్

రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి గురువారం సిఎం వెళ్లారు. షబ్బీర్ అలీకి మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సిఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. సిఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి సిఎం రేవంత్ అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు సిఎం రంజాబ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి తదితరులు షబ్బీర్‌అలీ ఇంటికి వచ్చి ఆయనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular