Monday, May 19, 2025

‘రామాయణ’లో కాజల్..?

మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ’లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె యశ్ సరసన రోల్ కోసం టీం సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ ఎపిక్‌గా ‘రామాయణ’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. రెండు పార్టులుగా మూవీ తెరకెక్కుతుండగా.. రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇక మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. యశ్ సరసన మండోదరి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రోల్ చాలా కీలకమని.. అందుకే అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ నిర్ణయించారట. ఉత్తరాది, దక్షిణాది నుంచి చాలామంది హీరోయిన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కాజల్ మాత్రమే ఆ రోల్‌కు సరిగ్గా సరిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. కాజల్ సైతం యశ్ సరసన నటించేందుకు ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాకింగ్ స్టార్ యశ్ సరసన కాజల్ కనిపించనుందనే న్యూస్‌తో నెట్టింట తెగ చర్చ సాగుతోంది. ఈ జోడీని ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా చర్చిస్తున్నారు నెటిజన్లు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా తక్కువేనని.. స్క్రీన్‌పై రావణుడి, మండోదరి రోల్స్‌లో పర్‌ఫెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో పార్వతీ దేవిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్‌గా ‘సత్యభామ’ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటించారు.

రామాయణ ప్రాజెక్టు గురించి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మైథలాజికల్ ఎపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రావణుడిగా యశ్ నటిస్తుండగా.. ఆయన ఇటీవలే షూటింగ్‌లో భాగమయ్యారు. పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ‘పార్ట్ 2’ను కూడా ట్రాక్ ఎక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మూవీలో యశ్ రావణుడిగా చేయడమే కాకుండా.. తన బ్యానర్ అయిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో పాటు మల్హోటా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ‘పార్ట్ 2’ కూడా 2027 దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రాముడు, సీత, రావణుడు, మండోదరి రోల్స్ కాకుండా మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com