Friday, January 10, 2025

అన్నదమ్ముల మధ్యలో కొడుకు.. నలిగిపోతున్నాడా?

చిరు..పవన్‌..మధ్యలో చరణ్‌ నలిగిపోతున్నాడా? అంటే అవుననే చెప్పాలి. దానికి ప్రధాన కారణం లేకపోలేదు. అదేమిటంటే.. ద‌ర్శ‌క‌డు శంక‌ర్? అంటే అవున‌నే తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ‘గేమ్ ఛేంజ‌ర్’ ఎంత కాలంగా ఆన్ సెట్స్ లో మూలుగుతోందో తెలిసిందే. 2021 లోప్రారంభ‌మైన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. చివ‌రికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా విసుగుపోయాడు. రిలీజ్ అవ్వాల్సిన‌ప్పుడు అదే రిలీజ్ అవుతుందిలే అని వదిలేశాడు. అయినా రిలీజ్ అవుతుంద‌నే ఓ ఆశ అంద‌రికీ ఉంటుందిగా. ఇప్పుడా ఆశ కార‌ణంగానే మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ న‌లిగిపోతున్నాడు.

‘గేమ్ ఛేంజ‌ర్’ రిలీజ్ అయితే సెప్టెంబ‌ర్ లో వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. అయితే అదే స‌మ‌యానికి బాబాయ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘ఓజీ ‘కూడా రిలీజ్ అవుతుంది. ఆ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు ఇది క‌న్ప‌మ్ అయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఆ నెలలో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ అన్న‌ది పెట్టుకునే ఛాన్సులు చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఇక సెప్టెంబ‌ర్ మిస్ అయితే గ‌నుక వెంట‌నే ద‌స‌రా దూసుకొస్తుంది.

సెల‌వుల సీజ‌న్ కాబ‌ట్టి రిలీజ్ కి అనువైన‌దే. కానీ ఒక‌వేళ రాలేకోపోతే గ‌నుక మళ్లీ 2025 స‌మ్మ‌ర్ వ‌ర‌కూ చ‌ర‌ణ్ ఆగాల్సిందే. సంవత్సరం చివర డిసెంబ‌ర్ ఆప్ష‌న్ ఉన్నా ‘పుష్ప‌-2’ ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ కి వాయిదా ప‌డితే గ‌నుక చ‌ర‌ణ్ అప్పుడు రావ‌డం క‌రెక్ట్ కాదు. ఇక సంక్రాంతికి ఛాన్సే లేదు. ఎందుకంటే చిరంజీవి న‌టిస్తోన్న ‘విశ్వంభ‌ర’ 2025 సంక్రాంతికి అని ముందే ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి ఆ సీజ‌న్ వైపు చ‌ర‌ణ్ చూసే ఛాన్స్ కూడా లేదు. మరి మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ పై క్లారిటీగా ఉంటే బావుంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com