Friday, April 4, 2025

రామ్‌చరణ్‌తో దేవర బ్యూటీ

ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది. బిజినెస్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారుకి సినిమా రంగం అంటే ఎంతో ఆసక్తి.

ఆ అభిరుచితోనే ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. తాజాగా RC 16 వంటి భారీ చిత్రంతో నిర్మాతగా ఆయన పరిచయం అవుతుండటం విశేషం. ఆర్‌సి 16 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్, బోనీ క‌పూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, చిత్ర స‌మ‌ర్ప‌కులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారికి, మా గురువుగారు సుకుమార్‌గారికి, ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. రంగస్థలం సినిమాకు నేను సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

నాపై నమ్మకంతో చరణ్‌గారు నాకు అవకాశం ఇచ్చారు. దీన్ని నేను సరిగ్గా వినియోగించుకుంటాను. ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్‌గారు మ్యూజిక్ అందిస్తున్నారు. నా రెండో సినిమాకే నా కల నేరవేరుతుందని అనుకోలేదు. అయితే చరణ్‌గారు, సుక్కుగారు, నవీన్‌గారు, రవిగారు, సతీష్‌గారి వల్ల నా కల నేరవేరింది. అందరికీ మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా జరగటానికి ప్రధాన కారణం మా గురువుగారు సుక్కుసార్. అందరికీ థాంక్స్’’ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com