Thursday, April 3, 2025

ఎన్నికల బరిలో వర్మ… పవన్‌ పై పోటీ

  • సోషల్‌ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండే వర్మ
  • నిజంగా పోటీ చేస్తాడా
  • లేక ఇది కూడా ఓ పబ్లిసిటీపిచ్చా
  • ఐయామ్‌ సూపర్‌ సీరియస్‌

ఏపీ న్యూస్‌ః దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకర్గం నుంచి బరిలో ఉంటానని ట్వీట్ చేశారు. ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని తెలిజేయడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన కొద్ది సమయానకే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. గతంలోనే పవన్‌పై వర్మ చాలా సార్లు విమర్ధలు గుప్పించిన విషయం తెలిసిందే. తరచూ ఆయన పై పంచులు విసురుతారు. ప్రస్తుతం ఈ ప్రకటన కూడా దీనిలోని భాగమేనని.. నిజంగానే ఆయన పోటీచేస్తాడా అనేది అనుమానంగా ఉంది. చాలా కాలంగా ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ప్రచారం కొనసాగుతుంది.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ ట్వీట్ కు సంబంధించి నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది నిజమేనా వర్మ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే పోటీపై పోస్టు చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. సందేహించేవారందరికీ చెబుతున్నాను… ‘ఐయామ్ సూపర్ సీరియస్’ అంటూ పోస్టును వదిలారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com