రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుండి ప్రారంభం కానుంది. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో.. రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. కాగా, రోజా పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు. రోజుకు ఐదు పూటల నమాజు చేస్తారు. ‘తరావీహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు.