Thursday, March 20, 2025

రణవీర్‌, దీపికల కుమార్తె పేరులో ఇంత అర్ధమా?

బాలీవుడ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ రణ్‌వీర్ – దీపికా పదుకొణె దంపతులు ఈ ఏడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని తొలిసారి చిన్నారి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న రణ్‌వీర్ – దీపికా..తమ ముద్దుల తనయ పేరును కూడా ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.
‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే’ ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు ఆలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. క్యూట్ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు. 2018లో రణ్‌వీర్ – దీపిక వివాహ బంధంతో ఒకటయ్యారు. కల్కి 2898 ఏడీతో అలరించిన దీపిక..సింగమ్ అగైన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com