Tuesday, April 8, 2025

రాష్ట్ర తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లానే టాప్

  • రాష్ట్ర తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లానే టాప్
  • హైదరాబాద్ కంటే రంగారెడ్డి ఆదాయం రెట్టింపు

దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా ఉందని సోషియే ఎకనామిక్ సర్వే నివేధికలో తెలింది. ఇక తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చే సరికి మాత్రం రంగారరెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని తెలింది. అసెంబ్లీలో బడ్జెట్ సందర్బంగా 2022-23 ఆర్ఖిక సంవత్సరానికి సంబందించిన సామాజిక ఆర్ధిక సర్వే నివేధకను సభలో పెట్టింది ప్రభుత్వం. గత మూడేళ్లుగా చూసుకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 1,50,906 రూపాయలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం 2,69,169 రూపాయలుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ తలససరి ఆదాయం 1,69,469 రూపాయలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం 3,11,649 రూపాయలుగా తెలింది.

2023-24 ఆర్ధిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలుగా ఉండగా, తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 లక్షలకు చేరినట్లు సోషియే ఎకనామిక్ నివేధిక తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు 3,11,649 రూపాయలుగా వెల్లడించింది నివేధిక. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని ప్రజలందరికి సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా లెక్కిస్తారు.

ఇక తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 9,46,862 రూపాయల ఆదాయంతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 4,49,033 రూపాయల ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 3,22,394 రూపాయలతో సంగారెడ్డి మూడో స్థానంలో, మేడ్చల్-మల్కాజిగిరి 2,95,514 రూపాయలతో నాలుగో స్థానం దక్కించుకున్నాయి. 2,67,605 రూపాయల ఆదాయంతో యాదాద్రి భవనగిరి జిల్లా 5వ స్తానంలో నిలిచింది. ఇక వికారాబాద్ జిల్లా 1,80,241 రూపాయల ఆదాయంతో మొత్తం ౩౩ జిల్లాల్లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com