Friday, December 27, 2024

రావు రమేష్.. మారుతి నగర్ సుబ్రమణ్యం అయ్యాడా?

రావు రమేష్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు. తండ్రికి తగ్గ తనయుడిగా… తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రావు రమేష్ ఎంపిక చేసుకునే పాత్రలు, వాటిలో ఆయన నటన ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తూ వస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్న రావు రమేష్ క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడూ హిట్ అవుతూ వచ్చాయి. అటువంటి నటుడు ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ ‘పుష్ప’, ‘కెజియఫ్’, ‘ధమాకా’ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ ”రావు రమేష్ గారిని ఇప్పటి వరకు చూసిన దాని కన్నా పదిరెట్లు ఎక్కువ ఎంటెర్టైన్ క్యారెక్టర్లో కనిపిస్తారు. చిత్రీకరణ పరంగా ఆయన మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ… ఎక్కువ డేట్స్ కేటాయించి సినిమా పూర్తి కావడానికి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాపై, మాపై ఆయనకు అంత నమ్మకం, ప్రేమ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది” అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ ”క్యారెక్టర్స్ సెలక్షన్ విషయంలో నిజాయతీగా ఉండే రావు రమేష్ గారు… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చేయడానికి ప్రధాన కారణం మా దర్శకుడు లక్ష్మణ్ కార్య రాసిన కథ. ఈ సినిమాలో కథ, ఆ కథలో భాగంగా కామెడీ ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మణ్ కార్య రాసిన మాటలు అందరినీ నవ్విస్తాయి. ఆ డైలాగులు రావు రమేష్ గారు చెప్పిన తీరు థియేటర్లలో విజిల్స్ వేయిస్తూ నవ్వించడం ఖాయం. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కూడా హల్ చల్ చేస్తాయి. అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్, ఇంద్రజ జంటగా కనిపించనున్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, అజయ్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ప్రధాన తారాగణం. ‘మేం ఫేమస్’, ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాల ఫేమ్ కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com