Friday, November 15, 2024

టీడీపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసులో కుదిరిన రాజీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిటిషన్ దాఖలు చేయగా.. ఈ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇరు వర్గాలు కాంప్రమైజ్ కావటంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పదిహేను రోజుల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను ఎమ్మెల్యే ఆదిమూలం లొంగదీసుకున్నారంటూ సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నేత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తనపై అఘాయిత్యం చేశారంటూ కొన్ని ప్రైవేట్ వీడియోలను కూడా ఆమె బయటపెట్టడం అప్పట్లో బయటపెట్టారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై తిరుపతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ పరిణామాలన్నింటిని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ తీరు సైతం చర్చనీయాంశమైంది. పోలీసుల వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇంటువంటి సమయంలో చివరకు పోలీసుల కౌన్సిలింగ్‌ తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది. ఈ లోపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే, నిజానిజాలు చూడకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడమేమిటని ఆయన పిటీషన్ లో ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న టైంలోనే బాధిత మహిళ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం ఇరువురు తరుపు ఉడ్వకేట్స్ తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారని హైకోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular