Monday, March 10, 2025

SLBC tunnel ఎస్‌ఎల్బీసీ సొరంగంలో శరవేగంగా సహాయక చర్యలు

కన్వేయర్‌ ‌బెల్ట్ ‌పనులు వేగవంతం
సహాయక బృందాల అధికారులతో సమీక్ష

ఎస్‌ఎల్బిసి ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్‌ ‌బెల్టు పనులను వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు. సోమవారం ఎస్‌ఎల్బి  టన్నెల్‌ ‌రెస్క్యూ ఆపరేషన్‌ ‌లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌బాదావత్‌ ‌సంతోష్‌, ‌టన్నెల్‌ ఇన్‌ ‌లెట్‌ ఆఫీస్‌ ‌వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు.

శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌ప్రాజెక్టు (ఎస్‌ఎల్బీసీ)లో సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలపై డిజాస్టర్‌ అం‌డ్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రెటరీ అరవింద్‌ ‌కుమార్‌, ‌టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ ముషారఫ్‌ ఆలీ, నాగర్‌ ‌కర్నూల్‌ ‌కలెక్టర్‌ ‌బాదావత్‌ ‌సంతోష్‌, ‌జిల్లా ఎస్పీ వైభవ్‌ ‌గైక్వాడ్‌ ‌రఘునాథ్‌, ‌కల్నల్‌ ‌పరీక్షిత్‌ ‌మెహ్ర, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ ‌రెస్క్యూ, ఎస్డీఆర్‌ఎఫ్‌ అధికారి, ఫైర్‌ ‌సర్వీసెస్‌, ‌దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ‌ర్యాట్‌ ‌మైనర్స్ ‌ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కన్వేయర్‌ ‌బెల్ట్ ‌మరమ్మత్తు పనులు వేగవంతం చేసి ఎస్‌ఎల్బీసీ ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

image.png

డీ వాటరింగ్‌ ‌ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌ ‌ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలకు ఎదురవుతున్న సమస్యలపై విశ్లేషించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 సంస్థలకు సంబంధించిన బృందాలతో అధికారులు సహయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక అధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటూ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్‌ ‌శిథిలాలను తొలగించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినయోగించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్బీసీ సొరంగంలోకి మీద నుంచి, ఇరువైపుల నుంచి నీరు రాకుండా… అలాగే సొరంగంలో ఇప్పటికే నిలువ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా యంత్రాలు నిరంతరం పని చేస్తున్నాయని అధికారులు వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com