Thursday, May 8, 2025

రష్మీకి అరుదైన వ్యాధి

* రష్మీకి అరుదైన వ్యాధి
* ఆయుర్వేద మందులు వాడలంటున్న బుల్లితెర ముద్దుగుమ్మ
వచ్చి రాని తెలుగుతో మాట్లాడుతూ.. అందంతో ఆకట్టుకుంటున్న రష్మీ గౌతమ్​.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ తో పాటు పలు టీవీ షోలతో బుల్లితెర క్వీన్​గా మారింది. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ షోల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది రష్మీ గౌతమ్. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కామెడీ షోలతో, మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఇక, హీరోయిన్ గాను సినిమాలు చేసింది రష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ సినిమాలో ఈ అమ్మడి తన అందంతో కవ్వించింది. రాణి గారి బంగళా, అంతంలాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రష్మీ. ఒక వైపు షోలతో మరో వైపు సినిమాలతో బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉంటే రష్మీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్​. రష్మీకి అనారోగ్య సమస్య ఉందని.. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు స్వయంగా రష్మీనే వెల్లడించింది. తనకు రూమటాయిడ్‌ అనే సమస్య ఉందని తెలిపింది. ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వ్యాధి.. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల త్వరగా జబ్బున పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం వస్తే త్వరగా కోలుకోలేరు. అయితే ఇప్పుడు ఇదే సమస్యతో రష్మీ బాధపడుతుంది. గతంలో అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఈ విషయాన్నీ బయట పెట్టింది రష్మీ.. అలాగే దీని నుంచి కోలుకోవడానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. దీనికి ఎలాంటి చికిత్స లేదని.. లైఫ్ స్టైల్ ల్లో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపింది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, పాజిటివ్ మైండ్ తో ఉండాలి. అదేవిధంగా ఈ వ్యాధితో బాధపడేవారు ఆయుర్వేద మందులు వాడాలని చెప్పుకొచ్చింది. అలాగే దీని నుంచి బయటపడటానికి స్టెరాయిడ్స్ తీసుకున్నాను చెప్పుకొచ్చింది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నొప్పిగా ఉండే ఇంజెక్షన్స్ ను తీసుకున్నాను అని తెలిపింది రష్మీ గౌతమ్.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com