Wednesday, December 4, 2024

రిమ్కోలియన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నగర విద్యార్థికి చోటు

తెలంగాణ డిజిపి సిపిఆర్‌ఓ కుమారుడికి అరుదైన స్థానం
రిమ్కోలియన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నగరానికి చెందిన చేపూరి అవినాష్ సీటు సంపాదించారు. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక Rashtriya Indian Military College (RSIMC) రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (ఆర్‌ఎస్‌ఐఎంసీ)లో చదివిన విద్యార్థులను రిమ్కోలియన్ పిలుస్తారు. నగరానికి చెందిన చేపూరి అవినాష్ తన 13వ ఏట రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ప్రవేశం పొందారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్ష ద్వారా ఈ ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. అక్కడ చదువు, శిక్షణ అనంతరం 2024లో మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటు పొందాడు. 2017లో ఉత్తరాఖండ్ స్టేట్ చాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ గెలిచాడు.

2023లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్‌లో సిల్వర్ మెడల్ అందుకోవడంతో పాటు అవినాష్ అనేక పతకాలను గెలుచుకున్నారు. 2019లో ఆర్‌ఐఎంసీ నుంచి మెరిట్ కార్డ్, హాఫ్-బ్లూ పురస్కారాలను చేపూరి అవినాష్ అందుకున్నారు. జాతీయస్థాయిలో 2021 నార్త్ జోన్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ చాంపియషిప్ జూనియర్, యూత్ కేటగిరీల్లో నేషనల్ చాంపియన్ షిప్‌కు అవినాష్ అర్హత సాధించారు. 2022, 2023లో 65వ, 66వ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) నుంచి రినౌన్డ్ షాట్ గా అవినాష్ అర్హత పొందడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ డిజిపి సిపిఆర్‌ఓగా పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసరావు పెద్ద కుమారుడు ఈ అవినాష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular