Saturday, March 22, 2025

రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లకు ‘నో టోల్​’

రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లులకు టోల్​ విధించే ఆలోచన లేదని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామని వివరించారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్​ రోడ్లు వేయిస్తామని చెప్పారు. బీఆర్​ఎస్​ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​కే రోడ్లు వేశారని విమర్శించారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులను సైతం వాడారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
రోడ్ల విషయంలో ఛాలెంజ్​ చేస్తున్నా రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్​రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సవాల్​ విసిరారు. కోమటిరెడ్డి సవాల్​ను స్వీకరిస్తున్నట్లు కూడా హరీశ్​రావు తెలిపారు. బీఆర్​ఎస్​ హయాంలో ఆర్​అండ్​బీ పనుల గురించి లెక్కలు తీద్దామని అన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com