Wednesday, October 16, 2024

Ratan Tata passed away దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత

దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

రతన్ టాటా (జననం 28 డిసెంబర్ 1937) ఒక భారతీయ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ . అతను 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌లకు నాయకత్వం వహిస్తున్నాడు. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్, రెండవ త్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు.

టాటా గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, 2023-24లో, టాటా కంపెనీలు లేదా ఎంటర్‌ప్రైజెస్ కలిసి $165 బిలియన్ల (సుమారు రూ. 13.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. సమిష్టిగా 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ 30 కంపెనీల్లో టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, ఎయిర్ ఇండియా, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టైటాన్, ఇన్ఫినిటీ రిటైల్ (క్రోమా), ట్రెంట్ (వెస్ట్‌సైడ్, జూడియో, జరా) వంటి మరిన్ని ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular