Friday, May 9, 2025

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్
పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగింది. బోథ్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు తాజాగా సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వెనువెంటనే బిజెపిలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.

మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ కూడా సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా పార్టీలో చేరారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com