ఎలక్ట్రిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎఫర్ట్ లెస్ యాక్టింగ్, అద్భుతమైన కామిక్ టైమింగ్ తో అలరించే మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మాస్టర్, దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి రవితేజ76 ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్యాలిటీ, హై ఎంటర్ టైన్మెంట్ వాల్యూస్ తో సినిమాలని అందించడంలో పాపులరైన ప్రతిష్టాత్మక ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ సిగ్నేచర్ స్టయిల్, కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ కథలో రవితేజ తనదైన ఎనర్జీతో అలరించనున్నారు.
అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ వెరీ స్టైలిష్ అవతార్‌లో, డిజైనర్ సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను, ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకంతో కనిపించడం అదిరిపోయింది. ఇది ఇప్పటివరకు రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తుంది. అతను పట్టుకున్న పుస్తకంలో “సీ ఇట్ & సే ఇట్” స్పానిష్‌లో ఉంది, ఇది అతని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ధమాకా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు.