Friday, January 10, 2025

మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ‘రజాకార్’ చిత్రం విడుదల

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. టీజర్‌ను కూడా విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. మార్చి 1న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈక్రమంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘రజాకార్ లాంటి చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డి గారికి థాంక్స్. చరిత్ర గురించి యువతకు చెప్పాలని ఈ చిత్రాన్ని తీశారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. చరిత్రను ఇలా దృశ్యరూపంలో చూపిస్తే మరింతగా అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మా శిష్యుడు యాటా సత్య నారాయణ నా వద్ద పదేళ్లు పని చేశాడు. చాలా అద్భుతంగా పని చేసేవాడు. సుద్దాల రక్తంతో పాటలు రాస్తారా? అని అనిపిస్తుంది. సర్దార్ వల్లభబాయ్ పటేల్ లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లం కాదు. రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్లు ఉండబట్టే ఇంకా భారతీయత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

కథా రచయిత భారవి మాట్లాడుతూ.. ‘రజకార్ టీజర్, ట్రైలర్ చూశాక ఈ చిత్రం నేను ఎందుకు చేయలేదు? అని బాధపడ్డాను. కానీ మా సోదరుడు యాటా చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ఏ పాన్ ఇండియన్ డైరెక్టర్ పేరు వేసినా కూడా వాళ్లే తీశారనేంత గొప్పగా ఉంది. ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో మళ్లీ మన సినిమా పరిశ్రమను మరో మెట్టు ఎక్కించేలా ఉంది. టాలీవుడ్ అంతా కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు రావాలి’ అని అన్నారు.

రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ.. ‘రజాకార్ ట్రైలర్ చూస్తే ఎంతో ఉద్వేగంగా, బాధగా అనిపించింది. నన్ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించిన మా గూడూరు నారాయ‌ణ రెడ్డి గారికి థాంక్స్. చరిత్రను చించేస్తే చినిగిపోదు. చరిత్రను మరిచిపోతే మనం ఖతం. ఈ ఘటనలు జరగి ఇంకా వందేళ్లు కూడా కాలేదు. ఇలాంటివి మళ్లీ జరగకూడదనే ఉద్దేశంలోనే ఇలాంటి సినిమాలు రావాలి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఎందుకు వచ్చాయి. చరిత్ర కాబ్టటి వచ్చాయి. మళ్లీ అలాంటివి జరగొద్దని తీశారు. సర్దార్ వల్లభబాయ్ మన దేశానికి ఒక్క మగాడు లాంటి వారు. మేం ఏ వ్యక్తికి, మతానికి వ్యతిరేకం కాదు.. రజాకార్ల మెంటాలిటీకి మేం వ్యతిరేకం. ఇలాంటి చరిత్రను తీయాలంటే దమ్మున్న నిర్మాత కావాలి. గూడూరు నారాయ‌ణ రెడ్డి గారికి ఆ దమ్ము, ధైర్యం ఉంది. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చిత్రాన్ని వీక్షించాలి’ అని అన్నారు.

దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ‘రాఘవేంద్రరావు గారి మీద అభిమానంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన వద్దకు వచ్చిన మూడు నెలల్లోనే నన్ను గుర్తించారు. నేను మనోయజ్ఞం, రాజమౌళి గారు శాంతి నివాసం ఇలా సీరియల్స్ స్టార్ట్ చేశాం. నా టాలెంట్ గుర్తించి.. నన్నో శిల్పంలా మార్చారు. నా గురువు రాఘవేంద్రరావు లేకపోతే నేను లేను. నా పెళ్లి కూడా ఆయనే దగ్గరుండి చేశారు. నా గురువు గారు ఇలా వచ్చి మా సినిమాను ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. నా గుండెలో రాఘవేంద్ర రావు గారి తరువాత గూడురు నారాయణరెడ్డి గారికి ఆ స్థానం ఉంటుంది. రజాకార్ వంటి సినిమా వస్తుంటే బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. మా చరిత్ర.. మా బాధ.. మా పూర్వీకుల బాధలు, త్యాగాలు.. ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల గురించి చెప్పడానికే ఈ చిత్రం తీశాను. హైద్రాబాద్‌కు, భారత్‌కు మాత్రమే కాదు.. ప్రపంచంలో అణచివేతకు గురైన ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం అంకితం. మీడియా ఈ చిత్రాన్ని భుజాన వేసుకుని ప్రజల ముందుకు తీసుకెళ్లండి. చరిత్రకు రేటింగ్ ఇవ్వకండి. నా నెక్ట్స్ సినిమాకు కావాలంటే జీరో రేటింగ్ ఇవ్వండి. రజాకార్లు చేసిన అన్యాయాల గురించి చెప్పేందుకే ఈ చిత్రాన్ని తీశాం. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు.

నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్ కోసం వచ్చిన రాఘవేంద్రరావు గారు, రాధా మనోహర్ దాస్ గార్లకు థాంక్స్. మన హైద్రాబాద్ చరిత్ర గురించి, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియదు. మళ్లీ రజాకార్లు పుట్టొద్దు. అందుకే ఈ చరిత్రను చిత్రంగా తీశాం. మన దేశంలో అన్ని మతాలు కలిసే ఉంటాయి. ఆనాడు జరిగిన దారుణాలను ఇప్పుడు భరించలేరు.. దెబ్బలు, తుపాకులు, కొరడా దెబ్బలు నాటి దురాగతాలు ఇప్పటి తరం భరించలేదు.. చూడలేదు.. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు అయింది. మూడు రెట్లు బడ్జెట్ పెరిగినా.. నా ఆస్తులు అమ్మినా కూడా మన చరిత్రను అందరికీ చూపించాలని తీశాం. మా సినిమాను జనాల వద్దకు మీడియానే తీసుకెళ్లాలి. దేశం కోసం, దేశంలోని పౌరుల కోసమే తప్పా.. మరేతర ఉద్దేశంతో సినిమాను తీయలేదు. ఎంతో కష్టపడ్డ మా సినిమా టీంకు థాంక్స్’ అని అన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘ఇది చరిత్ర. ఇది రక్త చరిత్ర. రక్తాక్షరాల చరిత్ర. రజాకార్ల రక్తాక్షరాల చరిత్ర పోతు గడ్డ మీద ఎలా జరిగిందని చారిత్రక వాస్తవాన్ని చూపించే ప్రయత్నం.. ఇది ప్రయత్నం కాదు.. యజ్ఞం.. వెండితెరపై యజ్ఞం చేయడం జరిగింది. ఈ సినిమాను తీసిన యాటా స‌త్య‌నారాయ‌ణ, గూడూరు నారాయ‌ణ రెడ్డి గార్లకు స్వాతంత్ర్య సమర యోధుల బిడ్డగా ధన్యవాదాలు. ఇది రెండు మతాల మధ్య వైషమ్యం కాదు. రజాకార్లలో హిందువులు కూడా ఉన్నారు. అల్లూరిని కాల్చిన బ్రిటీష్ వారిలో మన ఇండియన్ వాళ్లు ఉన్నట్టే.. రజాకార్లలో కూడా హిందువులున్నారు. రజాకార్లను వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వాళ్లలో మగ్దూం మొయినుద్దీన్ అనే గొప్ప కవి కూడా ఉన్నారు. ఖాసీం రజ్వీ మొదటగా ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ తలను నరికాడు. ఇందులో నేను రెండు పాటలు రాశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సుద్దాల హన్మంతు డీఎన్ఏ ఉంది కాబట్టే ఇందులో పాటలు రాశాను. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. ఇది సంచలనం మాత్రమే కాదు.. లక్షల కోట్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. ‘ఇంత ధైర్యంగా రజాకార్ చిత్రాన్ని తీసి చరిత్రను అందరికీ చూపిస్తున్న నిర్మాత గూడురు నారాయణ రెడ్డి గారికి థాంక్స్. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారికి థాంక్స్. మన నైజాంలో, హైద్రాబాద్‌లో ఏం జరిగిందో అందరూ తెలుసుకోవాలి. ఫ్రెంచ్ రివల్యూషన్, అలెగ్జాండర్ గురించి కాదు.. ముందు మన గురించి మనం తెలుసుకుందాం. మార్చి 1న ఈ చిత్రం చూసి అందరూ చలించిపోతారు. నేను ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూశాను. ఇంద్రజ, ప్రేమ, వేదిక, సింహా, మకరంధ్ గారు ఎంతో మంది అద్భుతంగా నటించారు. సినిమా అనేది చాలా గొప్ప మాధ్యమం. ఈ చిత్రంలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కెమెరామెన్ రమేష్ మాట్లాడుతూ.. ‘హైద్రాబాదీని అయినా కూడా నాకు ఈ చరిత్ర గురించి తెలియకపోవడం సిగ్గుగా అనిపించింది. 1947 కాదు.. 1948న మనకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిసేలా చెప్పిన యాట గారికి అప్పుడే హగ్ ఇచ్చాను. బడ్జెట్ ఎక్కువైనా కూడా ఎప్పుడూ మమ్మల్ని గూడురు నారాయణ రెడ్డి గారు ప్రశ్నించలేదు. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అందరినీ మెస్మరైజ్ చేసేలా సినిమా ఉంటుందిై’ అని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com