Monday, April 21, 2025

ఆర్బీఐ జాతీయస్థాయి క్విజ్ పోటీలు- 10 లక్షల బహుమతి

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటై 90 సంవత్సరాలు అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్బీఐ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు క్విజ్‌పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. బ్యాంకు 90వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు ఆర్బీఐ 90 పేరుతో క్విజ్‌ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ క్విజ్ కు సంబంధించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈనెల 17 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

ఆర్బీఐ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రతి కళాశాల నుంచి ఎంత మంది స్టూడెంట్స్ అయినా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఐతే ఒక టీంలో కనీసం ఇద్దరు ఉండాలి. మొత్తం నాలుగు దశల్లో ఈ క్విజ్ పోటీలు జరగనున్నాయి. ముందు జిల్లా స్థాయి, ఆ తరువాత రాష్ట్ర స్థాయి, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్విజ్ పోటీలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో జరుగుతాయి. ప్రధానంగా దాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్‌ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, చరిత్ర, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమకాలీన అంశాలు, తదితరాలపై ప్రశ్నలుంటాయి.

2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండి ఏదైనా కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారు పాల్గొనవచ్చు. ఈనెల 19 తేదీ నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు డీగ్రీ కళాశాలల విద్యార్థులు మెదడుకు పదునెడితే 10 లక్షల రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. విద్యార్థుల్లో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన పెంచడంతో పాటు డిజిటల్‌ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com