-
ఇకపై వెంటనే బ్యాంకులో చెక్కు క్లియరెన్స్
-
చెక్కు క్లియరెన్స్ పై ఆర్బీఐ కీలక ప్రకటన
బ్యాంకింగ్ రంగంలో కొన్ని రకాల సేవలు ఇప్పటికీ చాలా టైం తీకుకుంటున్నాయి. అందులో మరీ ముఖ్ంగా చెక్కు క్లియరెన్స్ కు రెండు రోజుల సమయం పడుతుతోంది. ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండు రోజుల సమయం తీసుకుంటున్నారు బ్యాంకర్లు. ఈ డిజిటల్ యూగంలో కూడా చెక్ క్లియరెన్స్ కు అంతసమయం తీసుకోవడం కొన్ని సందర్బాల్లో కస్టమర్లకు ఆర్ఖికపరమైన ఇబ్బందులకుగురిచేస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ క్లియరెన్స్ సిస్టమ్ పై ప్రత్యేక దృష్టి సారించింది.
చెక్ క్లియరెన్స్సమయాన్ని మెజార్టీ శాతం తగ్గించే కసరత్తును ప్రారంభించింది ఆర్బీఐ. కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ అయ్యేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పును ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ ప్రకటన చేశారు. చెక్కుల క్లియరెన్సుకు ప్రస్తుతం టీ ప్లస్-1 విధానం అమలవుతోందని ఆయన చెప్పారు. అందుకే చెక్ క్లియరెన్స్ కు రెండు రోజుల సమయంపడుతుందని అన్నారు. ఇప్పుడు దీన్ని కొన్ని గంటలకు తగ్గించే క్రమంలో ప్రస్తుతం అవలంబిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ విధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
ప్రస్తుతం చెక్ క్లియరెన్స్ లో భాగంగా చేస్తున్న బ్యాచ్‌ల వారీగా ప్రాసెసింగ్ కాకుండా, ఇకపై ఆన్ రియలైజేషన్ సెటిల్‌మెంట్ (ORS) విధానాన్ని అవలంబించబోతున్నట్లు చెప్పారు ఆర్బీఐ గవర్నర్. బ్యాంకు పని వేళల్లో చెక్కును స్కాన్ చేసి, ప్రజెంట్ చేసి, కొన్ని గంటల్లోనే ప్రాసెస్ చేసే విధంగా సరికొత్త విధానాన్ని అందుబోటులోకి తెస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ విధానంలో చెక్ బ్యాంక్ లో ప్రెసెంట్ చేసిన కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ పూర్తవుతుందని స్పష్టం చేశారు.