ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు.