Thursday, May 15, 2025

యూనిక్ కాన్సెప్ట్ తో.. ‘ప్రసన్న వదనం’

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ..ప్రసన్న వదనం మే3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్ననే ఫస్ట్ కాపీ చూశాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్.

ఇందులో డౌట్ లేదు. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు’ అన్నారు. దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ఇది దర్శకుడిగా నా మొదటి చిత్రం. సినిమా చాలా బావొచ్చింది. ఫస్ట్ కాపీ చూశాం. థియేటర్స్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. సుహాస్ అద్భుతంగా చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com