Monday, July 8, 2024

ఎపి నుంచి మమ్మల్ని రిలీవ్ చేయండి

  • సీనియార్టీ కోల్పోయిన ఫర్వాలేదు మేము తెలంగాణలో పనిచేస్తాం
  • ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల అభ్యర్థన

రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) విభజన పూర్తి అయి పదేళ్లు అవుతున్న తెలంగాణ ఉద్యోగులు ఇంకా ఎపిలోనే పని చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపి నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎపిలో 712 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే సచివాలయం, వివిధ హెచ్‌ఓడిల కార్యాలయాలు, 9, 10 వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని వారు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే ఉద్యోగులు తమ సీనియార్టీ కోల్పోయిన ఫర్వాలేదని, తమను తెలంగాణకు పంపాలని ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తమ విజ్ఞప్తులను పరిష్కారించాలని రెండు రాష్ట్రాల సిఎంలను (ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి)ని తెలంగాణ ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular