Thursday, January 9, 2025

కేసీఆర్‌ను జ‌గ‌న్ ఎందుకు క‌లిశారు?

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయ‌న గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకోగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ కి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అయితే జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరిన రోజే.. ఆయ‌న సీఎం కేసీఆర్ ను క‌ల‌వ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జ‌గ‌న్ అధికార ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి.. ఇక్క‌డి కొత్త సీఎం రేవంత్‌రెడ్డిని క‌ల‌వ‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎందుకంటే ఇక్క‌డి సీఎం రేవంత్‌రెడ్డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డ‌మే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com