- ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు సర్క్యూలర్ ఎకానమీ కార్యక్రమం
- చేతులు కలిపిన రీ సస్టెయినబిలిటీ, మారికో సంస్థ
జీరో వేస్ట్ టూ ల్యాండ్ ఫిల్ కింద ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైక్లింగ్, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సర్క్యూలర్ ఎకానమీ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు సస్టెయినబులిటీ సొల్యూషన్స్ అగ్రగామి సంస్థ రీ సస్టెయినబిలిటీ, హర్ష్ మారివాలా కి చెందిన మారికో సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ షార్ప్ వెంచర్స్ చేతులు కలిపాయి. తెలంగాణలోని హైదరాబాద్, చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ప్లాస్టిక్స్ సర్క్యూలారిటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ పాలీఓలిఫిన్స్ సరఫరాను పెంచడం, పర్యావరణం అలాగే సామాజికంగా సుస్థిరమైన ప్రభావాన్ని సాధించడమనే రెండు లక్ష్యాలు కార్యక్రమంలో ఇమిడి ఉన్నాయి.
ప్రస్తుతం భారతదేశంలోని ఎఫ్ఎంసీజీ రంగం అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ మెటీరియల్స్‌ను సోర్స్ చేయడంలో గణనీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో సస్టెయినబిలిటీ లక్ష్యాలను సాధించడంలో, వర్జిన్ ప్లాస్టిక్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి సంబంధించి వాటి సామర్థ్యాలు పరిమితంగా ఉంటున్నాయి. 32,000 టన్నుల వ్యర్ధాలను క్యాప్చర్ చేయడం, ప్రాసెస్ చేయడం, వార్షికంగా 15,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఏటా 9,000 టన్నుల పైగా అత్యుత్తమ రీసైకిల్డ్ పాలీమర్స్‌ను ఉత్పత్తి చేయాలని, వివిధ ఎఫ్ఎంసీజీ, ఇతరత్రా అవసరాలకు ఆ మెటీరియల్‌ను సరఫరా చేయాలని ఈ ప్రాజెక్టు నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ కార్యక్రమం పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ విధానాలకు కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రీసైకిల్డ్ పాలీమర్స్ ఎంటర్‌ప్రైజ్‌గా విస్తరించనుంది.
హైదరాబాద్, రాయపూర్ నగరాల్లో ఈ కీలకమైన సర్క్యూలారిటీ ప్రాజెక్టు ప్రారంభించడం ద్వారా 2026 నాటికి ఈ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వినియోగంలోకి రాగలదని ఈ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మారికో లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ హార్ష్ మారివాలా మాట్లాడుతూ.. ఇటు పర్యావరణానికి అటు సమాజానికి మేలు చేసే సర్క్యులర్ ఎకానమీని నిర్మించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలకమైన ముందడుగు కాగలదని అన్నారు. అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ మెటీరియల్స్ సరఫరాను పెంచడం, సుస్థిరమైన వ్యర్థాల నిర్వహణ విధానాలను రూపొందించడం ద్వారా పరిశ్రమలో ఆవిష్కరణలకు, జవాబుదారీతనానికి మేము కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని చెప్పారు. ఈ విస్తృత మోడల్స్‌ను పాటించేలా మిగతా ప్రాంతాలవారికి కూడా ప్రేరణగా నిలవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అనంతరం రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్ సంస్థ ఎండీ సీఈవో మసూద్ మల్లిక్ మాట్లాడుతూ..
ఈ విశిష్టమైన సర్క్యులారిటీ కార్యక్రమమనేది భారత సర్క్యులర్ ఎకానమీ ప్రస్తానంలో ఒక కీలక మైలురాయి అని అన్నారు. సామాజిక చేర్పుతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల సవాలును పరిష్కరించాలని, ల్యాండ్‌ఫిల్స్‌కు రీసైక్లబుల్స్ చేరడాన్ని నివారించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మనం ఉత్పత్తి చేసే ప్రతి కిలో వ్యర్థంతో, వినియోగించుకోతగిన ఆర్థిక విలువ, వనరుల పరిరక్షణ, కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశంతో పాటు కాలుష్య నివారణ ప్రభావాలు ముడిపడి ఉన్నాయని అన్నారు.
ఈ కోణాలన్నింటిలోనూ దాగి ఉన్న అపార ‘విలువ’ను ఈ కార్యక్రమం ద్వారా వెలికితీయడమనేది భారతదేశంలో మరింత సర్క్యులర్ ఎఫ్ఎంసీజీ పరిశ్రమను సాధించే దిశగా ఒక కీలకమైన అడుగు కాగలదని అన్నారు. మనం వ్యర్ధాలను ఏ విధంగా నిర్వహించుకుంటున్నాం, తిరిగి ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనేది పునఃపరిశీలించుకోవడం ద్వారా వాటిని మరింత విలువైన వనరులుగా మార్చుకోగలమని అన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వగలమని, . రాబోయే తరాల కోసం స్వచ్ఛమైన, మరింత సుస్థిరమైన పర్యావరణాన్ని మరియు మరింత మెరుగైన భవిష్యత్తును అందించగలమని అన్నారు.