Friday, April 4, 2025

Red corner notice: ప్రభాకర్ రావు కు రెడ్ కార్నర్ నోటీసు

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. తాజాగా ప్రభాకర్‌రావు, శ్రవణ్ కుమార్‌కు సీఐడీ శనివారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ముందుగా ప్రభాకర్ రావు‌కు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి సీఐడీ అధికారులు సమాచారం అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాతో సిట్‌కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యా పింగ్ కేసులో ఏ 6గా ఉన్న శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. శ్రవణ్ రావ్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులని హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com