Friday, April 11, 2025

Red corner notices: ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​నోటీసులు

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఏ1 నిందితుడు ప్రభాకర్​రావుకు పోలీసులు రెడ్​కార్నర్​ నోటీసులు జారీ చేశారు. ఎస్​ఐబీ మాజీ చీఫ్​తో పాటుగా తెలుగు ఛానల్​ ఎండీ శ్రవణ్​రావుకు కూడా రెడ్​కార్నర్​ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్​రావు కీలక నిందితుడిగా ఉన్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. అయితే, ఈ కేసు విచారణకు ముందే ఆయన విదేశాలకు వెళ్లాడు.

ముందస్తు ప్లాన్​లో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటికే ప్రభాకర్​రావు కోసం లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి విచారణకు రావాలంటూ లుక్​ అవుట్​, బ్లూ కార్నర్​ నోటీసులు ఇచ్చినా.. ఆయన ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం రెడ్​ కార్నర్​ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా సహకరించనున్నాయి. దీంతో ఆయన్ను త్వరలోనే అరెస్ట్​ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com