Thursday, January 9, 2025

సీఎంఓలో రెడ్డి ఆధిపత్యం.. కీలక శాఖల్లో వారిదే హవా

 

టీఎస్ ​న్యూస్​: బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఒకవర్గం వేళ్లూనుకుని కూర్చుంటే.. కాంగ్రెస్​పాలనలో రెడ్డి వర్గం వంతు మొదలైంది. ప్రస్తుతం సీఎంఓలో నియమితులైన పలువురు అధికారుల పేర్లు ఇప్పుడు వైరల్​గా మారుతున్నాయి. కేవలం ఒక వర్గానికి మాత్రమే రేవంత్​రెడ్డి ఆధిపత్యం చెలాయించే అధికారాలు కట్టబెడుతున్నట్లు సొంత పార్టీలోనే మండిపడుతున్నారు. కాంగ్రెస్​పార్టీలోని కొంతమంది ఇప్పుడు రెడ్డి అధికారుల జాబితాను బయటకు విడుదల చేశారు.

మహేందర్​రెడ్డికి పదవితో బద్నాం
టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్​రెడ్డిని ఖరారు చేయడంతో రేవంత్​రెడ్డిపై విమర్శలు పెరిగాయి. డీజీపీ మహేందర్​రెడ్డిపై ఒక దశలో టీపీసీసీ చీఫ్​గా ఉన్న రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేందర్​రెడ్డికి సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని, ఇంతకంటే హీనమైన బతుకు ఎందుకని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు మహేందర్​రెడ్డికి కీలకమైన టీఎస్​పీఎస్పీ పగ్గాలు అప్పగించారు. దీంతో ఇప్పటి వరకు రేవంత్​ కు సపోర్ట్​గా ఉన్న పలువురు ఒక్కసారిగా షాక్​ తిన్నారు. నిజానికి, ఈ పోస్టును రిటైర్డ్​ ఐఏఎస్​ ఆకునూరి మురళికి ఇస్తారని భావించారు. కానీ, ఆయన సామాజికవర్గం నాన్​ రెడ్డి కావడంతోనే పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.

కీలక శాఖల్లో వీరే
ప్రస్తుతం సీఎం రేవంత్​రెడ్డి ఉండగా.. కిందిస్థాయిలో కూడా రెడ్డి వర్గీయుల హవా మొదలైంది. సీఎం సెక్రెటరీ జి. చంద్రశేఖర రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్​రెడ్డి, సీఎస్ఓ గుమ్మి చక్రవర్తి రెడ్డి, సీపీఆర్వో అయోధ్య రెడ్డి, సీఎం ఇంటలీజెన్సీ చీఫ్​ శివధర్​ రెడ్డి, అడ్వకేట్​ జనరల్​ సుదర్శన్​ రెడ్డి, అడిషనల్​ అడ్వకేట్​ జనరల్​ రజనీకాంత్​ రెడ్డి, హైదరాబాద్​ సీపీ శ్రీనివాస్​రెడ్డి, సీఎం వ్యక్తిగత సహాయకుడు జైపాల్​రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్​రెడ్డి, టీఎస్​పీఎస్సీ చైర్మన్​ మహేందర్​రెడ్డి, గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి పేర్లు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com