ప్రేక్షకులనుఎంతగానో అలరిస్తూ వస్తున్న అతిపెద్ద రియార్టీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఈసారిబిగ్ బాస్ హౌజ్ లోకి ఊహించని సెలబ్రిటీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడుసీజన్ల కంటే భిన్నంగా బిగ్ బాస్ షో ఎనిమిదో సీజన్ ఉంటుందని చెబుతున్నారు. బిగ్ బాస్8వ సీజన్ కు సంబందించిన ప్రోమో సైతం ఇప్పటికే విడుదలైంది. ఈ సీజన్ లోగోను కూడా సరికొత్తగాడిజైన్ చేశారు. ఇక బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ సెలక్షన్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది.
8వ సీజన్బిగ్ బాస్ హౌజ్ లోకి టీవీ నటీనటులు, యాంకర్స్, యూట్యూబర్లు, పోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్తో పాటు కొందరు వివాదాస్పద వ్యక్తులు అడుగుపెట్టనున్నట్లుతెలుస్తోంది. ఇందులో ప్రధానంగా నటుడు, ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్, హీరో రాజ్ తరుణ్, రోడ్సైడ్ ఫుడ్ కోర్టుతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, బర్రెలక్క, యాదమ్మ రాజు, బుల్లెట్ భాస్కర్,రీతూ చౌదరి, విష్ణుప్రియ, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇంతవరకు బాగానేఉన్నా ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే మరో కంటెస్టెంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అదెవరో కాదు రేఖా భోజ్. విశాఖపట్నం కు చెందిన రేఖా భోజ్ ను బిగ్ బాస్ షో నిర్వాహకులుసంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లుగా సమాచారం. అన్నట్లు రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ.మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: తదితర సినిమాల్లో నటించింది.
ప్రస్తుతంవైజాగ్ సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింటతెగ సందడి చేస్తోంది రేఖా భోజ్. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖబీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఈమె. అంతే కాదు పవన్ కల్యాణ్కు వీరాభిమాని అయిన రేఖ భోజ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారంసైతం చేసింది. మరి రేఖా భోజ్ బిగ్ బాస్ హౌజ్ లో ఎలా సందడి చేస్తుందో చూడాలని అభిమానులుఎక్సైట్ అవుతున్నారు.