Monday, May 19, 2025

ఉస్మానియా హాస్పిటల్ వద్ద GHMC మేయర్, కాంగ్రెస్ ఎంపీపై తిరగబడ్డ మృతుల బంధువులు

చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వేసవి సెలవులు అని బెంగాల్ నుంచి వచ్చిన ఎంతో మంది ఈ అగ్నిప్రమాదంలో చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు.

ఉస్మానియా హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన
అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీద మృతుల బంధువులు తిరగబడ్డారు. ప్రమాదం జరిగిన స్థలానికి అంబులెన్సు సమయానికి వస్తే మా కుటుంబ సభ్యులు బ్రతికేవారు అని అన్నారు. అంబులెన్సులో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేదు, ఉంటే నా కుటుంబసభ్యులు బతికేవారంటూ మృతుల బంధువులు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి మాకు బుద్ది వచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందువల్లే మా ఇంట్లో 16 మంది చనిపోయారు అని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు.

 

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం, ఫైర్ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ వాదన మరోలా ఉంది. అగ్నిప్రమాదం గురించి 6.16 గంటలకు సమాచారం అందగా, 6.17కు అగ్నిమాపక సిబ్బంది మొగల్ పురా నుంచి బయలుదేరారని, అనంతరం మరికొన్ని ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశాయని చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లోకి వెళ్లడానికి ఒకటే మార్గం ఉండటం, దట్టమైన పొగలు, మంటలతో తలుపులు బద్దలుకొట్టుకుని సిబ్బంది లోపలికి వెళ్లినట్లు తెలిపారు. ఫైర్ ఎగ్జిట్ లాగ బిల్డింగ్ లోని వారు బయట పడేందుకు ఎలాంటి మార్గం లేదని.. ఇరుకైన మెట్ల మార్గం కారణంగా ప్రాణ నష్టం అధికంగా సంభవించినట్లు పేర్కొన్నారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడం, ఆ వెంటనే కిచెన్ లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నలుగురు ప్రాణాలతో బయటపడగా, 8 మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com